- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనెజులాలో ఉద్రిక్తత.. భారత విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ
వెనుజులాలో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: వెనుజులాలో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు అవనసరమైన ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప వెనుజులాకు వెళ్లవద్దని సూచించింది. అంతే కాకుండా వెనుజులాలో ఉన్న భారీతీయులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఏదైనా సమస్య ఉంటే కారకస్ లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. [email protected] అనే ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నెం. +58-412-9584288 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే వెనుజులా నుండి డ్రగ్స్ అమెరికాకు సరఫరా చేస్తున్నారనే కారణంతో ట్రంప్ వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నాడు. వెనుజులాపై అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 40మంది వరకు మరణించినట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగశాఖ అప్రమత్తమైంది.






