- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెక్‌పోస్ట్‌పై దాడి, 4 ఉగ్రవాదులు, ఇద్దరు పోలీసులు మృతి
పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పాక్ ఆఫ్ఘాన్ నై వైమానిక దాడికి పాల్పడి.. పదుల సంఖ్యలో ప్రజలను హతమార్చింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పాక్ ఆఫ్ఘాన్ నై వైమానిక దాడికి పాల్పడి.. పదుల సంఖ్యలో ప్రజలను హతమార్చింది. దీంతో ఆగ్రహంగా ఉన్న ఆఫ్ఘాన్ పాక్ పై ప్రతికార చర్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి ఘర్షణలో కనీసం నలుగురు మిలిటెంట్లు, ఇద్దరు పోలీసులు మరణించినట్లు తెలుస్తుంది. సెంట్రల్ కుర్రం జిల్లాలోని చినారక్ ప్రాంతంలో ఉన్న పోలీస్ చెక్‌పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ సంఘటన జరిగింది.
ఈ దాడి వెంటనే భద్రతా సిబ్బందికి, మిలిటెంట్లకు మధ్య తీవ్ర కాల్పుల చోటు చేసుకున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులు తక్షణమే స్పందించి, ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మిలిటెంట్లు హతమవగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు కూడా వీరమరణం పొందారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు అంచనా వేస్తున్నారు. తాజా దాడితో మరోసారి పాక్, ఆఫ్ఘాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






