- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
by Naga Rani Yarlagadda |
ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి హయ్యర్ స్టడీస్ కోసం జర్మనీ వెళ్లాడు. ఓ అపార్ట్మెంట్లో ఉండి చదువుకుంటున్నాడు. అతను ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరగడంతో భవనం నుంచి కిందికి దూకేశాడు. దీంతో హృతిక్ రెడ్డి తలకు తీవ్రగాయమయింది. ఆస్పత్రికి తరలించేలోగానే పరిస్థితి విషమించి మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హృతిక్ రెడ్డి మరణవార్తలో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నూతన సంవత్సరంలో కుమారుడి మరణవార్తతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Next Story






