Trump: ట్రంప్‌ హత్యకు పిల్లాడు మాస్టర్‌ ప్లాన్...డబ్బులు ఇవ్వలేదని ఏకంగా తల్లిదండ్రులనే చంపేశాడుగా

by Vennela |
Trump: ట్రంప్‌ హత్యకు పిల్లాడు మాస్టర్‌ ప్లాన్...డబ్బులు ఇవ్వలేదని ఏకంగా తల్లిదండ్రులనే చంపేశాడుగా
X

దిశ, వెబ్ డెస్క్: Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 17ఏళ్ల నికితా కాసాప్ అనే యువకుడు ట్రంప్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రంప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పథకం ప్రకారం..తన పేరేంట్స్ ను హత్య చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

విస్కాన్సిన్ కు చెందిన నికితా కాసాప్ ఫిబ్రవరి 11న తన తల్లిదండ్రులను వారి ఇంట్లోనే కాల్చి చంపాడని ఫెడరల్ అధికారులు వెల్లడించారు. వీరిద్దరి శరీరాల్లో బుల్లెట్లను గుర్తించారు. కుళ్లిపోయిన శరీరాలతోనే కొన్ని రోజులపాటు అతను ఉన్నాడు. ఆ తర్వాత 14000డాలర్ల నగదు పాస్ పోర్ట్, తన పెంపుడు కుక్కతో పారిపోయాడని వాకేషా కౌంటీ అధికారులు ఆ యువకుడిపై అభియోగాలు నమోదు చేశారు. గత నెలలో కాన్సాస్ లో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాసాప్ తన పేరెంట్స్ హత్యలకు ప్లాన్ చేశాడని..డ్రోన్, పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడని..రష్యన్ మాట్లాడే వ్యక్తితో సహా ఇతరులతో తన ప్లాన్ షేర్ చేసుకున్నాడని ఫెడరల్ పోలీసులు భావిస్తున్నారు. అడాల్ఫ్ హిట్లర్ ను ప్రశంసిస్తూ మూడు పేజీల యాంటిసెమిటిక్ మ్యానిఫెస్టోను కూడా పోలీసులు గుర్తించారు.

ఇతనిపై రెండు ఫస్ట్ డిగ్రీ హత్య, శవాలను దాచిపెట్టడం, ఆస్తిదొంగతనం, అధ్యక్షుడిని చంపేందుకు కుట్ర పన్నడం, సామూహిక విధ్వంసం, ఆయుధాలను వినియోగించడం వంటి తొమ్మిది నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. తీవ్రవాద భావజాలం ఉన్న ఇతను తన హింసాత్మక ప్రణాళిక గురించి పలువురితో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి28న అధికారులు టిటాయానా, మేయర్ డెడ్ బాడీలను గుర్తించారు. మేయర్ గత రెండు వారాలుగా పనికి రాకపోవడంతోపాటు నికాతా కాసాప్ స్కూలుకు వెళ్లకపోవడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి.



Next Story

Most Viewed