- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Faridabad: భార్య పై అనుమానం.. నలుగురు పిల్లలతో కలిసి తండ్రి సూసైడ్
ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో ఘోర ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో నలుగురు పిల్లలతో కలిసి ఓ తండ్రి కదులుతున్న రైలు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో ఘోర ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో నలుగురు పిల్లలతో కలిసి ఓ తండ్రి కదులుతున్న రైలు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో అయిదుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. ఘటన స్థలంలో పోలీసులు పరిశీలన జరపగా ఆధార్ కార్డు లభించింది. సూసైడ్ చేసుకున్న వ్యక్తిని బిహార్ కు చెందిన మనోజ్ మహతోగా గుర్తించారు. సంఘటనా స్థలంలో ఒక మొబైల్ నంబరు లభించగా.. దాన్ని ట్రేస్ చేశారు. అది అతని భార్య నెంబర్ అని నిర్ధారణ అయింది. వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాలను గుర్తించారు.
పిల్లల్ని పార్క్ కు తీసుకెళతానని చెప్పి
మనోజ్ తన భార్యకు ‘పిల్లలను పార్క్‌కి తీసుకెళ్తున్నాను’ అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కొన్ని గంటల తర్వాత ఆయన నలుగురు పిల్లలతో కలిసి గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి కిందకు దూకినట్లు రైల్వే స్టేషన్ మాస్టర్ కు సమాచారం వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. కాగా భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. మనోజ్ భార్య ప్రీతి వేరే వ్యక్తితో ఫోన్ లో తరచూ మాట్లాడుతుండటంతో అనుమానంతో ఇలా చేశాడని భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను బద్షాహ్ ఖాన్ సివిల్ హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.






