కుక్కకు సర్ ఫ్రైస్.. బర్త్ డే గిఫ్ట్‌గా బంగారం అక్షరాలతో చెక్కిన లక్షల విలువైన ఇల్లు

by Disha Web Desk 9 |
కుక్కకు సర్ ఫ్రైస్.. బర్త్ డే గిఫ్ట్‌గా బంగారం అక్షరాలతో చెక్కిన లక్షల విలువైన ఇల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రుల కోసమో, పిల్లల కోసమో, ప్రేమించిన వారి కోసమో ఏం ఆలోచించకుండా ఎన్ని లక్షలైన ఖర్చు చేస్తాం కదా. కానీ ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్క కోసం రూ.16 లక్షలు ఖర్చు పెట్టి ఏకంగా ఇల్లే నిర్మించాడు. వినడానికి ఆశ్యర్యంగా, వింతగా ఉన్నా ఇది నూటికి నూరు శాతం నిజం. ఈ వింత సంఘటన కాలిఫోర్నియాలో జరిగింది. 25 ఏళ్ల బ్రెంట్ రివెరా అనే యువకుడు తను ఎంతో ప్రేమించే కుక్క కోసం లగ్జరీ ఇల్లు కట్టించి.. దాని మొదటి పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ ఇంట్లో శునకం కోసం కుర్చీలు, సోఫాలు, బీన్ బ్యాగులు, ఫ్రిడ్జ్, టీవీ, మెత్తటి విలాసవంతమైన బంక్ బెడ్, కాఫీ టేబుల్ లాంటి సౌకర్యాలు కూడా అమర్చాడు.

కుక్క టీవీ చూస్తుందా? అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘అందులో కేవలం దానికి నచ్చేవి ఎప్పటికి ప్లే అయ్యేలా సెట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంటి బయట బంగారు అక్షరాలతో ‘చార్లీ హౌస్’ అని రాయించాడు. తర్వాత చార్లీని ఆ కొత్త ఇంటికి తీసుకొచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దీంతో అది ఎగ్జైట్ అవుతుంటే చూసి బ్రెంట్ తెగ సంబరపడుతూ ‘ చార్లీకి కొత్త హౌస్ నచ్చిందోచ్చు’ అంటూ ఎగిరి గంతులేశాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ‘ స్వేచ్ఛగా తిరిగే జీవిని బంధించి, మనుషుల్లా వాటికి కూడా ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాంటూ కొందరు, కుక్క కోసం ఇంత ఖరీదైన ఇంటిని నిర్మించడం గ్రేట్’ అంటూ మరికొందరు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read..

కుక్కకు సర్ ఫ్రైస్.. బర్త్ డే గిఫ్ట్‌గా బంగారం అక్షరాలతో చెక్కిన లక్షల విలువైన ఇల్లు


Next Story

Most Viewed