Supreme Court: స్టూడెంట్ సూసైడ్ కేసులో ఇన్ చార్జి తప్పులేదు: సుప్రీం కోర్టు సంచలన తీర్పు

by Shamantha N |

స్టూడెంట్ ను పాఠశాల, హాస్టల్ ఇన్ చార్జి తిట్టడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. స్టూడెంట్ ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగం కింద ఇండియన్ ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం హాస్టల్ ఇన్‌ఛార్జ్‌ పై కేసు నమోదైంది.

Supreme Court: స్టూడెంట్ సూసైడ్ కేసులో ఇన్ చార్జి తప్పులేదు:  సుప్రీం కోర్టు సంచలన తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: స్టూడెంట్ ను పాఠశాల, హాస్టల్ ఇన్ చార్జి తిట్టడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. స్టూడెంట్ ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగం కింద ఇండియన్ ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం హాస్టల్ ఇన్‌ఛార్జ్‌ పై కేసు నమోదైంది. జస్టిస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. మరో విద్యార్థి చేసిన ఫిర్యాదుతో హాస్టల్ ఇన్ చార్జి స్టూడెంట్ ను మందలించాడని కానీ అతడు ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేడని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని నిర్దోషి అని తేలుస్తూ తీర్పు వెలువరించింది.

మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత..

గతంలో ఇదే కేసులో మద్రాస్ హైకోర్టు (Madras High Court)ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. విద్యార్థిని తిట్టడం ద్వారా అతడు ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేమని చెప్పింది. విద్యార్థి సూసైడ్ చేసుకోవడానికి నిందితుడు ఎలాంటి కారణం అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. నిందితుడు హాస్టల్‌లో శాంతి, క్రమశిక్షణను పరిరక్షించడానికి చేసిన పనే అని, అతడికి విద్యార్థితో వ్యక్తిగత వైరం లేదని పేర్కొంది.

Next Story