- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mango farmers: మామిడి రైతులను ఆదుకోండి.. కేంద్రానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ
కర్ణాటకలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్ననేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. మార్కెట్ లో మామిడికి ధరలు లేకపోవడంతో రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్ననేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. మార్కెట్ లో మామిడికి ధరలు లేకపోవడంతో రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ధరల లోటు చెల్లింపు పథకం (Price Deficiency Payment Scheme) అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో మామిడి ప్రధాన ఉద్యానవన పంట. ఈ రబీ సీజన్‌లో సుమారు 1.39 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు గ్రామీణ, అర్బన్, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు దక్షిణ జిల్లాల్లో పండిన మామిడితో 8–10 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేసినట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలో క్వింటాలుకు రూ. 12 వేలు ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 3 వేలకు పడిపోయాయని పెట్టుబడులు పూర్తిగా పెరిగిపోయాయన్నారు. రైతులు పెట్టుబడులూ తిరిగి పొందలేని పరిస్థితికి చేరిపోయారన్నారు.
మామిడి రైతుల నిరసన
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NAFED, NCCF వంటి సేకరణ సంస్థలు మామిడి కొనుగోలు కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని కోరారు. కనీసం రైతులు తమ సాగు ఖర్చును తిరిగి పొందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల కోలార్ జిల్లాలోని శ్రీనివాసపురలో మామిడి రైతులు తాలూకా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకు కూడా లేఖ రాశారు. తోతాపురి మామిడిని చిత్తూరు జిల్లాలోకి తీసుకెళ్లడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.






