భారీ పేలుడు.. 23 మంది మృతి

by Naga Rani Yarlagadda |

మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్లో భారీ పేలుడు జరిగింది.

భారీ పేలుడు.. 23 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్లో భారీ పేలుడు జరిగింది. అక్కడి కాలమానం ప్రకారం శనివారం హెర్మెసిల్లోలోని వాల్డో సూపర్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనను రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story