- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 రోజుల మిషన్ కు వెళ్లి, 78 రోజులైనా.. తిరిగిరాని సునీతా విలియమ్స్!
ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా.. స్పేస్ టూర్ కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, 78 రోజులు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు.

దిశ, వెబ్ డెస్క్: ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా.. స్పేస్ టూర్ కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, 78 రోజులు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు. జూన్ 5 వ తేదీన అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోర్ తో కలిసి.. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, నిజానికి జూన్ 14 నే భూమ్మీదకి తిరిగి రావాల్సి ఉండగా, వారు వెళ్లిన స్టార్ లైనర్స్ లో సాంకేతిక సమస్యల కారణంగా వారు ఇద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. దీంతో సునీతా విలియమ్స్ స్పేస్ లోనే ప్రమాదానికి గురై ఉంటారేమోనన్న ఊహాగానాలు అందరిని కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉండగా స్టార్ లైనర్ లో తలెత్తిన సమస్యలను సరిచేసే పనిలో పడ్డారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు. కాగా స్పేస్ టూర్ కు ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లేందుకు బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు జూన్ 5 తేదీన నాసా ఈ మిషన్ ను చేపట్టిన సంగతి తెల్సిందే.






