పాకిస్థాన్ లో సూసైడ్ టెర్రర్ ఎటాక్.. 16 మంది సోల్జర్స్ మృతి

by Shamantha N |

పాకిస్థాన్ లో మరో టెర్రర్ ఎటాక్ జరిగింది. ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్ లో మిలిటరీ వెహికల్ పై శనివారం ఉగ్రవాదులు సూసైడ్ బాంబ్ ఎటాక్ తో విరుచుకుపడ్డారు

పాకిస్థాన్ లో సూసైడ్ టెర్రర్ ఎటాక్.. 16 మంది సోల్జర్స్ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ లో మరో టెర్రర్ ఎటాక్ జరిగింది. ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్ లో మిలిటరీ వెహికల్ పై శనివారం ఉగ్రవాదులు సూసైడ్ బాంబ్ ఎటాక్ తో విరుచుకుపడ్డారు. ఈ దాడి ఘటనలో 16 మంది పాకిస్థాన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోయారు. శనివారం జరిగిన ఈ దాడి ఘటనలో స్థానికులు కూడా చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ (Tehreek-e-Taliban Pakistan) ప్రకటించుకుంది. గతేడాది బలూచ్ ఆర్మీ ట్రైన్ ను ఆపి దాడి చేయగా దాదాపు పదుల సంఖ్యలో ఆర్మీ జవాన్లు మరణించారు. అటు ఖైబర్ ఫంక్తువాలో తెహ్రీక్ తాలిబాన్ గ్రూపు, ఇటు బలూచ్ ఆర్మీ అంతర్గత దాడులతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది.

తాజాగా ఉగ్రశిబిరాల ఏర్పాటు

ఆపరేషన్ సిందూర్ లో భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలను మళ్లీ పునర్ నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఈ విషయం బయటపెట్టిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ లో పేలుళ్లు సంభవించాయి. ఐఎస్ఐ, పాక్ టాప్ మోస్ట్ టెర్రరిస్టులు బహవల్పూర్ లో మీటింగ్ పెట్టుకుని పాక్ లో నేలమట్టం అయిన ఉగ్రశిబిరాలను మళ్లీ నిర్మించాలని, వాటికి అత్యంత టెక్నాలజీతో రాడార్లు కూడా గుర్తుపట్టనంత పటిష్టంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా తాము పెంచి పోషిస్తున్న టెర్రరిస్టులే ఇలా పాకిస్థాన్ ఆర్మీపై దాడులు చేసి విరుచుకుపడుతున్నాయి. అయినా పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా టెర్రరిస్టు క్యాంపులను పునర్ నిర్మిస్తున్నారు.

Next Story