పాకిస్తాన్ పెషావర్‌లో మరోసారి ఆత్మాహుతి దాడులు

by Malleboina Mahesh |

ఉగ్రవాదులకు నిలయం అయిన పాకిస్థాన్‌ వరుస ఆత్మాహుతి దాడులతో ఉద్రిక్తత వాతావరణంలోకి వెళ్లిపోయింది.

పాకిస్తాన్ పెషావర్‌లో మరోసారి ఆత్మాహుతి దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదులకు నిలయం అయిన పాకిస్థాన్‌ వరుస ఆత్మాహుతి దాడులతో (series of suicide attacks) ఉద్రిక్తత వాతావరణంలోకి వెళ్లిపోయింది. కొద్ది రోజుల కిందట జరిగిన దాడులు మరవకముందే.. పెషావర్ నగరంలో మళ్లీ ఉగ్రవాద దాడులు జరిగాయి. ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ముష్కరులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు చెలరేగాయి. దాడికి తర్వాత ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో సెక్యూరిటీ ఫోర్స్ ప్రతిదాడి ప్రారంభించాయి.

ఈ వరుస ఘటనలతో ఆ ప్రాంతం మొత్తం అతలాకుతలం అయింది. సుదీర్ఘంగా జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు పాకిస్థాన్ కమాండర్లు మరణించినట్లు సమాచారం అందుతుంది. అలాగే మరో ఇద్దరు ముష్కరులు సెక్యూరిటీ దళాలతో ఘర్షణ కొనసాగిస్తున్నారు. దీంతో పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని ముట్టడించి, అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆత్మాహుతి దాడులపై స్థానిక ప్రభుత్వం అప్రమత్తమై మొత్తం ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించింది. కాగా ఈ వరుస ఆత్మాహుతి దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story