Axiom -4 : 18 రోజులు అంతరిక్షంలో.. భూమికి శుభాంశు శుక్లా ఆగమనం.. డ్రాగన్‌ అన్ డాకింగ్ సక్సెస్

by Ramesh Naini |

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి భూమికి శుభాంశు శుక్లా బృందం బయల్దేరింది.

Axiom -4 : 18 రోజులు అంతరిక్షంలో.. భూమికి శుభాంశు శుక్లా ఆగమనం.. డ్రాగన్‌ అన్ డాకింగ్ సక్సెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) నుంచి భూమికి (Shubhanshu Shukla) శుభాంశు శుక్లా బృందం బయల్దేరింది. దాదాపు 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ వ్యోమగామి శుక్లా.. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇవాళ (సోమవారం) సాయంత్రం 4:30 గంటలకు స్పేస్ స్టేషన్ నుంచి స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అన్ డికింగ్ ప్రక్రియ సక్సెస్ అయ్యింది. రేపు పసిఫిక్‌ సముద్రలోని కాలిఫోర్నియా తీరంలో స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటలకు ల్యాండ్ కానుంది. ఐఎస్ఎస్ నుంచి భూమికి చేరుకోడానికి స్పేస్ క్రాప్ట్‌కు దాదాపు 22 గంటల సమయం పడుతుందని నాసా ప్రకటించింది.

ఐఎస్ఎస్ నుంచి క్రూ మెంబర్లు వీడ్కోలు సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండర్ తకుయా ఒనీషి శుభాంశు శుక్లా బృందం సాహసోపేత యాత్రను అభినందించారు. అంతరిక్ష పరిశోధనల్లో వారి కంట్రిబ్యూషన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, వ్యోమగాముల బృందం భూమిపైకి చేరాక 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. డాక్టర్ల పర్యవేక్షణలో.. భూమికి అలవాటు పడిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారు. కాగా, (Axiom Mission) యాక్సియం-4 మిషన్‌లో భాగంగా స్పెస్ ఎక్స్, నాసా ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు.

ఐఎస్ఎస్‌లో వారు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు జరిపారు. భార రహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై మొత్తం 60 ప్రయోగాలు చేశారు. వీటిలో ఇస్రో తరపున శుభాంశు శుక్లా 7 ముఖ్యమైన ప్రయోగాలు చేశారు. అలాగే నాసా నిర్వహించిన మరో 5 జాయింట్ స్టడీస్‌లోనూ శుక్లా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. మొదటి సారి 1984లో రాశేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజుల పాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు సృష్టించారు.

Next Story