BREAKING : తైవాన్ లో భారీ భూకంపం

by Naga Rani Yarlagadda |

తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది.

BREAKING : తైవాన్ లో భారీ భూకంపం
X

దిశ, వెబ్‌డెస్క్: తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. అక్కడి కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.05 గంటలకు భూకంపం సంభవించినట్లు తైవాన్ వాతావరణ సంస్థ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైనట్లు పేర్కొంది. దేశంలోని ఈశాన్య తీరప్రాంత నగరమైన యిలాన్లో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భూకంపకేంద్రం యిలాన్ కౌంటీ హాల్ కు తూర్పున 32.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం ధాటికి భవనాలు, ఇళ్లు ఊగిపోగా.. వస్తువులు నేలపై పడి పగిలిపోయాయి. ఈ పరిణామాలతో భయపడిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

తైవాన్ అగ్నిమాపక సంస్థ ప్రాణ, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు ఏవీ లేవని వాతావరణ సంస్థ తెలిపింది. కాగా.. మూడురోజుల క్రితమే కౌంటీ టైటుంగ్ లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోసారి భూకంపం రావడంతో తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2024 ఏప్రిల్ లో 7.4 తీవ్రతతో భూకంపం రాగా 17 మంది మరణించారు. ఇది పాతికేళ్ల తర్వాత వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు తెలిపారు.

Next Story