- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Strait of Hormuz Toll: రూ.18 కోట్లు చెల్లించి హార్ముజ్‌ను దాటిన నౌక!
హార్ముజ్ జలసంధి గుండా సేఫ్ గా వెళ్లేందుకు ఓ చమురు నౌక.. రెండు మిలియన్ డాలర్లు చెల్లించినట్లు లాయిడ్స్ లిస్ట్ స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య 20 రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ను మట్టి కనిపించేందుకు, ఇజ్రాయెల్ అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అగ్ర నేతలు చనిపోయినప్పటికీ ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు హార్ముజ్ జలసంధి దగ్గర శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఇండియా లాంటి మిత్ర దేశాలకు సంబంధించిన నౌకలను వదిలేస్తున్న ఇరాన్, శత్రువులకు సంబంధించిన నౌకలకు బ్రేక్ వేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది.
హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే హార్ముజ్ జలసంధి గుండా సేఫ్ గా వెళ్లేందుకు ఓ చమురు నౌక.. రెండు మిలియన్ డాలర్లు చెల్లించినట్లు లాయిడ్స్ లిస్ట్ స్పష్టం చేసింది. అంటే దాదాపు రూ.18.7 కోట్లు చెల్లించిందన్నమాట. అయితే ఏ దేశానికి సంబంధించిన నౌక ఈ భారీ మొత్తంలో చెల్లించిందనే విషయం బహిర్గతం కాలేదు. కాగా మలేషియా, ఇండియా, చైనా, పాకిస్తాన్ దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ దేశంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు 9 నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఇందులో ఇండియాకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.






