- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ వార్...రియాద్‌లో మరో భారతీయుడు మృతి !
సౌదీ అరేబియాలో ఉన్న భారతీయుడు మృతి చెందారు. ఇప్పటికే ఐదుగురు మరణించగా ఆ సంఖ్య తాజాగా ఆరుకు చేరింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 20 రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా కలిసి పోరాడుతున్నాయి. అయితే ఇరాన్ మాత్రం తెలివిగా గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. లేటెస్ట్ గా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో దాడికి పాల్పడింది ఇరాన్. అయితే ఈ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మరో ఇండియన్ మరణించారు. మార్చి 18వ తేదీన సౌదీ అరేబియాలోని రియాద్ లో దాడులకు తెగ బడింది ఇరాన్.
అయితే ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాలో ఉన్న భారతీయుడు మృతి చెందారు. ఇప్పటికే ఐదుగురు మరణించగా ఆ సంఖ్య తాజాగా ఆరుకు చేరింది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. మార్చి 18వ తేదీన రియాద్ లో ఓ భారతీయుడు చనిపోయినట్లు తెలిపింది. దీనిపై ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వివరించింది. అటు మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో కాంటాక్ట్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది.






