SpaceX: ఎలాన్‌ మస్క్‌.. స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం.. కేంద్రం వద్దే పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు

by Ramesh Naini |

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ తయారు చేసిన స్టార్‌ షిప్‌ రాకెట్‌ (SpaceX Rocket) మరోసారి పేలిపోయింది.

SpaceX: ఎలాన్‌ మస్క్‌.. స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం.. కేంద్రం వద్దే పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ తయారు చేసిన స్టార్‌ షిప్‌ రాకెట్‌ (SpaceX Rocket) మరోసారి పేలిపోయింది. బుధవారం రాత్రి యూఎస్‌లోని టెక్సాస్‌లో స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ 36 (Starship rocket 36) రాకెట్ ప్రయోగం విఫలమైంది. మాస్సీస్ టెస్ట్ సైట్లో స్టాటిక్ టెస్ట్ చేస్తున్న టైమ్‌లో రాకెట్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రాప్టర్ ఇంజిన్లలో హార్డ్వేర్ వైఫల్యం వల్ల పేలుడు జరిగినట్లు స్పేస్ ఎక్స్‌ ప్రాథమిక నివేదిక తెలిపింది. ఇక, రాకెట్ ప్రయోగ కేంద్రం వద్దే పేలిపోవడం, అది కూడా మొదటి దశలోనే రాకెట్ ధ్వంసం అవ్వడం స్పేస్ ఎక్స్‌కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటనపై మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.

కాగా, ఇంధన ట్యాంక్ ముందు భాగంలో పేలుడు సంభవించిందని రాకెట్ శాస్త్రవేత్త స్కాట్ మ్యాన్లీ తాజాగా ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ‘వీడియోలో కొన్ని ఫ్రేములు గమనిస్తే.. ముందుగా ఉన్న ట్యాంక్ వేరు కావడం, మిథేన్ వాయువు బయటకు రావడం వల్ల ఒక ఇంపల్స్ (ఒత్తిడి) ఏర్పడింది. కింద ఉన్న ట్యాంక్ ఒత్తిడి గురైంది. దీంతో ప్రొపెలెంట్ మిశ్రమం ద్వారా అగ్నిప్రమాదం సంభవించింది’ అని ఆయన స్పష్టం చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Next Story