- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meghalaya murder case: వివాహేతర సంబంధంతోనే భర్తను చంపించిన సోనమ్
హనీమూన్ కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: హనీమూన్ కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా భార్య సోనమ్ పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ప్రియుడితో కలిసి మర్డర్ చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కొత్తగా పెళ్లైన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ మే 23న మెఘాలయ హనీమూన్‌కి వెళ్లి ఆ తర్వాత అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లోయలో కనబడటంతో మేఘాలయా పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జూన్ 8న సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
మర్డర్ చేసి తప్పించుకోవచ్చని భావించి
పోలీసులు చేసిన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సోనమ్ వివాహేతర సంబంధం వల్లే భర్తను హత్య చేయించిందని రాజ్ కుశ్వాహా అనే వ్యక్తి ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఆమె రాజాను చంపించి మృతదేహాన్ని లోయలో పడేసి తప్పించుకునే ప్రణాళిక వేసింది. రాజా రఘువంశీ సోదరుడు మాట్లాడుతూ.. రాజ్ కుశ్వాహాతో సోనమ్ ఫోన్ లో మాట్లాడుతుండేది. అయితే అతడిని తాను ఎప్పుడూ చూడలేదని సోనమ్, కుశ్వానా ఇద్దరు ఒకే కంపెనీలో ఉద్యోగం చేసేవారని చెప్పాడు. యూపీ పోలీసుల అధికారి అమితాభ్ యాష్ మాట్లాడుతూ.. సోనమ్ చాలా చీప్ ప్లానర్. మర్డర్ చేసి ఈజీగా తప్పించుకోవచ్చని అనుకుంది. తాను తప్పించుకోవడానికి తనకు డ్రగ్స్ ఇచ్చి ఘాజీపూర్ తీసుకొచ్చినట్లు తానే బాధితురాలిని అన్నట్లు నటించిందని అన్నారు. కానీ పోలీసుల విచారణలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలడంతో సోనమ్, రాజ్ ఇద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్నామన్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.






