ఉక్రేనియన్ పోలీసులకు గిఫ్ట్‌గా బిఎమ్‌డబ్ల్యూని 'మెషిన్ గన్‌' కారులా మార్చాడు!!

by Disha Web Desk 20 |
ఉక్రేనియన్ పోలీసులకు గిఫ్ట్‌గా బిఎమ్‌డబ్ల్యూని మెషిన్ గన్‌ కారులా మార్చాడు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 2022 ఫిబ్రవరి 24న ర‌ష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి యావ‌త్ ప్రపంచం ఆ సంక్షోభం తాలూకు ఆలోచ‌న‌ల్తోనే నిండిపోయారు. ఉక్రెయిన్ ప్రజలు తమ మాతృభూమి నుండి శరణార్థులుగా విదేశాల‌కు వెళ్తున్న వైనం క‌ళ్ల‌ముందు క‌దులుతూనే ఉంది. అయితే, ఓ గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఇలా వెళ్లిపోతూ త‌మ భ‌ద్ర‌తా బ‌ల‌గాల కోసం మంచి బ‌హుమ‌తి వ‌దిలేసి వెళ్లాడు.

మైకోలైవ్ నగరంలో ఉక్రేనియన్ పోలీసులు స్థానిక పోలీసు స్టేషన్ ఎదురుగా ఓ బిఎమ్‌డ‌బ్ల్యూ 6 సిరీస్ కారును చూశారు. అయితే, అది మోడిఫై చేసిన మెషిన్ గ‌న్ కారు కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఉక్రేనియన్ జెండాలు త‌గిలించి, మెషిన్ గన్ టరెట్‌తో ఉన్న ఆ కారును చూసి పెట్రోలింగ్ పోలీసులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యారు. అయితే, ఈ కారుపైన ఓ మెసేజ్ కూడా రాసుంది. 'ర‌ష్య‌న్ వార్‌షిప్ వెన‌క్కి వెళ్లిపో..' అంటూ సందేశం ఉంది. మోడిఫికేష‌న్‌లో దీనికి అమ‌ర్చిన మెషిన్ గ‌న్ కూడా అత్యాధునిక‌మైన‌దే కావ‌డం విశేషం. ఎవ‌రు దీన్ని వ‌దిలేసి వెళ్లారో తెలియ‌దు గానీ, వారి దేశ భ‌క్తికి ఉక్రెయిన్ పోలీసులు 'స‌లాం' చేస్తున్నారు.


Next Story

Most Viewed