- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధరామయ్య లక్ బాగుంది సీఎం అయ్యాడు.. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్
కర్ణాటక సీఎం Siddaramaiah ను మార్చే ఆలోచన లేదని కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే, సీనియర్ నేత బీఆర్ పాటిల్ మాట్లాడిన వీడియో లీక్ కావడం కలకలం రేపింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక సీఎం Siddaramaiah ను మార్చే ఆలోచన లేదని కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే, సీనియర్ నేత బీఆర్ పాటిల్ మాట్లాడిన వీడియో లీక్ కావడం కలకలం రేపింది. ఆయన మాట్లాడుతూ.. ‘సిద్ధరామయ్యకి లాటరీ తగిలింది. సోనియా గాంధీకి ఆయనను పరిచయం చేసింది నేనే’ అని అన్నారు. కానీ నాకు గాడ్‌ఫాదర్ లేదు. నేను రాందీప్ సింగ్ సుర్జేవాలాను కలిసి అన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి అని అన్నారు. ఈ వీడియో, ఎమ్మెల్యేలతో చర్చల్లో నాయకత్వ మార్పు లేదు అన్న రాందీప్ సింగ్ సుర్జేవాలా వ్యాఖ్యల తర్వాత బయటపడటం విశేషం.
తాను ఎమ్మెల్యేల మద్దతు కోరడం లేదు: డీకే శివకుమార్
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తాను సీఎం కావాలని ఎమ్మెల్యేల మద్దతు కోరడం లేదని, ఎమ్మెల్యేలు 2028 లో పార్టీ విజయం పైనే దృష్టి పెట్టాలని నేషనల్ మీడియాకు వెల్లడించారు. అయితే ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. 138 మంది ఎమ్మెల్యేల్లో 100 మంది శివకుమార్ వెనుక ఉన్నారని చెప్పారు. సీఎం మారకపోతే 2028లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాలేకపోవచ్చని హెచ్చరించారు. కాగా కొన్ని రోజుల నుంచి కర్ణాటక సీఎం మార్పు జరుగుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ సీఎంగా ఎన్నికవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తన సమాధానం చెప్పిన కొన్ని గంటల్లోనే ఇలా మరో ఎమ్మెల్యే ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.






