- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
H-1B Visa: అమెరికా షట్‌డౌన్ ఎఫెక్ట్.. హెచ్-1బీ వీసాల ప్రాసెస్‌పై తీవ్ర ప్రభావం
అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ షట్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల (H-1B visa) హెచ్-1బీ వీసాల ప్రక్రియపై ప్రభావం పడనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Donald Trump) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ షట్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల(H-1B visa) హెచ్-1బీ వీసాల ప్రక్రియపై ప్రభావం పడనుంది. యూఎస్ ప్రభుత్వ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నిలిపివేయడం, వివిధ కార్యాలయాలు మూసివేతతో వీసాల ప్రాసెసింగ్ కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునర తాజాగా వెల్లడించారు. షట్‌డౌన్ ముగిసిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
కాంగ్రెస్‌లో ఫెడరల్ నిధుల కేటాయింపులు లేకపోవడం వలన వీసాల ప్రక్రియ నిలిచిపోతుందని నిపుణులు తెలిపారు. అసలు హెచ్-1బీ వీసాల కేటాయింపునకు ముందుగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వద్ద "లేబర్ కండీషన్ అప్లికేషన్" దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు ఆమోదమయ్యాకే, ఆ కంపెనీ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు (USCIS) వద్ద హెచ్-1బీ పిటిషన్‌ను సమర్పిస్తోంది.
USCIS తమ కార్యకలాపాలను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజుల ద్వారా నిర్వహిస్తాయి కాబట్టి, వాటిపై షట్‌డౌన్ ప్రభావం ఉండదు. కానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌కి ఫెడరల్ నిధులు కేటాయిస్తారు. అందువల్ల లేబర్ కండీషన్ అప్లికేషన్ ధృవీకరణ పొందడం కష్టం అవుతుంది. తాజా పరిస్థితిపై భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం స్పందించింది. అమెరికా, విదేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో పరిస్థితి సహకరించినంత వరకు కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొంది. కాకపోతే ట్విటర్ ఖాతాల్లో మాత్రం అప్‌డేట్లు ఉండవని తెలిపింది.






