Shubhanshu Shukla : ISS నుంచి శుభాంశు శుక్లా ఫస్ట్ మెసేజ్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-26 16:40:14  IST  )

యాక్సియం-4 మిషన్‌(Axiom-4 Mission) ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) నేడు సక్సెస్ ఫుల్ గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ISS) చేరుకున్న సంగతి తెలిసిందే.

Shubhanshu Shukla : ISS నుంచి శుభాంశు శుక్లా ఫస్ట్ మెసేజ్
X

దిశ, వెబ్ డెస్క్ : యాక్సియం-4 మిషన్‌(Axiom-4 Mission) ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) నేడు సక్సెస్ ఫుల్ గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ISS) చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ISS నుంచి శుభాంశు శుక్లా తన ఫస్ట్ మెసేజీని భూమి మీదకు పంపించాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ISS ఉన్నవారు స్వాగతం పలుకుతుంటే ఇంట్లోకి వచ్చిన అనుభూతి కలిగిందని వెల్లడించాడు.

ఇక్కడి నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్ది మందిలో నేను కూడా ఉండటం ఆనందం కలిగిస్తోందని అన్నాడు. భారతీయుల ప్రేమ, ఆశీస్సుల వల్లే తాను ఇక్కడికి చేరుకోగలిగానన్నారు. రానున్న రోజుల్లో అంతరిక్షానికి సంబంధించిన కీలక పరిశోధనలు చేపడతామని తెలిపాడు.

Next Story