- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్.. ఇకపై మరింత కఠినంగా వీసా రూల్స్
అమెరికా వీసా, పౌరసత్వ విధానాలు మరింత కఠినంగా మారనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కొత్త డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా (America) వెళ్లాలనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇకపై అమెరికా వీసా, పౌరసత్వ విధానాలు మరింత కఠినంగా మారనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కొత్త డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో అనుసరించిన విధానాలు చాలా తేలికగా ఉండేవని, అందువల్ల వ్యవస్థలో క్లిష్టత లోపించిందని ఆయన వ్యాఖ్యానించారు. పౌరసత్వ పరీక్షల్లో బట్టి పట్టి నేర్చుకుని సమాధానాలిచ్చే ప్రశ్నలకన్నా, అభ్యర్థి నిజంగా అమెరికా గురించి ఎంత అవగాహన కలిగి ఉన్నాడో తెలుసుకునేలా ప్రశ్నలు ఉండాలన్నారు. ఈ క్రమంలో పౌరసత్వ టెస్ట్‌ను తిరిగి రూపొందించాలన్న యోచన USCISలో సాగుతున్నట్లు తెలిపారు.
అలాగే, వీసా ప్రక్రియను గణనీయంగా కఠినతరం చేయాలన్న ఉద్దేశంతో H-1B వీసా లాటరీ విధానంలో మార్పులు చేపట్టనున్నట్టు చెప్పారు. అధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ, వీసా ఎంపికలో జీత స్థాయిని ప్రామాణికంగా తీసుకుంటారని వెల్లడించారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత సమాచారంపై ఎక్కువగా దృష్టిసారించి, ఇంటర్వ్యూలను తప్పనిసరి చేసే దిశగా వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. వలస విధానాల విషయంలో గణనీయమైన మార్పులు రానున్నాయని, అర్హతలు కలిగిన వారు మాత్రమే అమెరికా పౌరసత్వం పొందేలా చర్యలు తీసుకుంటామని ఎడ్లో స్పష్టం చేశారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.






