- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్‌లో అరాచక పాలన.. యూనస్ వైఫల్యంతో దేశ ప్రతిష్ట మంటగలిసింది: షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఉదంతంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఉదంతంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నడుస్తున్న తాత్కాలిక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో నెలకొన్న అశాంతి, మైనారిటీల అణచివేత అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
యూనస్ హయాంలో పెరిగిన అరాచకాలు..
"ఉస్మాన్ హాదీ హత్య బంగ్లాదేశ్‌లో రాజ్యమేలుతున్న అరాచకత్వానికి పరాకాష్ట. నా ప్రభుత్వాన్ని కూలదోసిన ఆ అరాచక శక్తులు, ఇప్పుడు యూనస్ నేతృత్వంలో మరింతగా రెచ్చిపోతున్నాయి. హింస అనేది దేశంలో ఒక సాధారణ విషయంగా మారిపోయింది. ఈ తాత్కాలిక ప్రభుత్వం గానీ, అధికారులు గానీ అల్లర్లను అడ్డుకోలేకపోతున్నారు లేదా ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తున్నారు" అని హసీనా విమర్శించారు. ప్రాథమిక శాంతిభద్రతలను కాపాడలేనప్పుడు అంతర్జాతీయ వేదికపై దేశ విశ్వసనీయత పూర్తిగా కుప్పకూలుతుందని ఆమె హెచ్చరించారు.
భారత్‌తో సంబంధాలపై ప్రభావం..
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చితి పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను కూడా దెబ్బతీస్తోందని హసీనా పేర్కొన్నారు. "భారత్ వంటి పొరుగు దేశాలు బంగ్లాదేశ్‌లోని గందరగోళాన్ని, మైనారిటీలపై జరుగుతున్న హింసను నిశితంగా గమనిస్తున్నాయి. మేము ఇన్ని ఏళ్లుగా ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ప్రస్తుత పాలన నాశనం చేస్తోంది. దేశ సరిహద్దుల్లో కనీస క్రమశిక్షణ లేకపోవడం పొరుగు దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇదే యూనస్ పాలనలోని బంగ్లాదేశ్ వాస్తవ పరిస్థితి" అని ఆమె తేల్చి చెప్పారు.






