"X" Down : ఎక్స్ సేవలకు తీవ్ర అంతరాయం.. మండిపడుతున్న నెటిజన్స్

by Muthe.Rajitha |

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్(X) సేవలు సోమవారం మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా మరోసారి నిలిచిపోయాయి.

X Down : ఎక్స్ సేవలకు తీవ్ర అంతరాయం.. మండిపడుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్(X) సేవలు సోమవారం మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా మరోసారి నిలిచిపోయాయి("X" Down). సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. లాగిన్‌ అయినా యాక్సిస్‌ చేయలేక యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక గంటల పాటు ఎక్స్‌ సేవలు స్తంభించిపోయినట్లు పేర్కొంటున్నారు. ఎక్స్‌ సైట్‌ను ఓపెన్‌ చేయగా.. స్క్రీన్‌పై ‘సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌.. ప్లీజ్‌ ట్రై అగెయిన్‌’ అన్న సందేశం వస్తున్నట్లు యూజర్స్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 57 శాతం యూజర్స్ ఈ అసౌకర్యానికి గురైనట్టు సమాచారం. ఎక్స్‌ అంతరాయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చాలా మంది వినియోగదారులు సర్వర్ డౌన్ అయినట్లు ఫిర్యాదు చేశారు. ఈ అంతరాయం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఒకింత గందరగోళానికి గురవ్వడమే కాకుండా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా దీనిపై ఇంతవరకు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ఎలాంటి ప్రకటన చేయలేదు.

Next Story