- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోవిడ్ వ్యాక్సిన్‌లపై ఆరోపణలు.. స్పందించిన కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరమ్
కరోనా వ్యాక్సిన్‌ల వల్లనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోవీషీల్డ్ తయారీ సంస్థ సీరమ్ స్పందించింది.

దిశ, వెబ్ డెస్క్: కరోనా వ్యాక్సిన్‌ల వల్లనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోవీషీల్డ్ తయారీ సంస్థ సీరమ్ స్పందించింది. వాక్సిన్లు సురక్షితం అని శాస్త్రీయంగా రుజువైందని పేర్కొంది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని కేంద్రం ఆధ్వర్యంలోని రెండు సమగ్ర అధ్యయనాల్లో తేలిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ అధ్యయనాలను ధృవీకరిస్తున్నామని పేర్కొంది. ఇదిలా ఉంటే కర్నాటకలోని ఓ జిల్లాల్లో 40 రోజుల్లోనే 20 గుండెపోటుతో మరణించారు.
దీనిపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల వల్లనే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. మరణాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో తేల్చాలని ఓ కమిటీని వేశారు. దీనిపై ఇప్పటికే ఎయిమ్స్, ఐసీఎంఆర్ సైతం స్పందించాయి. గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని ప్రకటించాయి. గుండెపోటు మరణాలకు వ్యాక్సిన్ కారణం అవుతుందని ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. మారిన జీవనశైలి, ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలే ఆకస్మిక మరణాలకు కారణం అని పేర్కొన్నాయి.






