- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1400 కోట్లు ఎక్కడివో స్వంత చెల్లికి సమాధానం చెప్పు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో ఎలినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సరూర్ నగర్ సభలో తెలంగాణ ప్రజలు విదేశాలకు ఎందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని కానీ సామాన్యుల పిల్లలు విదేశాల్లో చదువుకో వద్దా అని సూటిగా ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు దక్కింది నిజం కాదా అన్నారు. పేదలకు మంచి చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి తాపత్రయం అన్నారు. కేటీఆర్ మాత్రం ప్రభుత్వాన్ని దించాలని మనసులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.14 వందల కోట్ల ఎలా వచ్చాయో అని అడుగుతున్నా స్వంత చెల్లి కల్వకుంట్ల కవితకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






