- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 20న శ్రీ జగన్నాథుడి రథయాత్ర : ఇస్కాన్
ఓరుగల్లు మహానగరంలో జూలై 20న మధ్యాహ్నం 1 గంటకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వెంకటేశ్వర గార్డెన్ వరకు ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మురళి వదన కృష్ణ దాస్ ప్రభు తెలిపారు. కీర్తనలు, భజనలతో భక్తిశ్రద్ధల మధ్య రథయాత్ర సాగనుంది.

దిశ, హన్మకొండ టౌన్ : ఓరుగల్లు మహానగరంలో జూలై 20వ తేదీన మధ్యాహ్నం ఒకటి గంటలకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్డు ఎంజీఎం జంక్షన్, పోచమ్మ మైదానం యూటర్న్ తీసుకొని ఎంజీఎం జంక్షన్ వెంకటేశ్వర గార్డెన్ వరకు జగన్నాధుడి రథయాత్ర భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా కీర్తనలు భజనలు నడుమ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ టెంపుల్ వరంగల్ నిర్వాహకులు మురళి వదన కృష్ణ దాస్ ప్రభు తెలిపారు.
ఈ రథయాత్రలో వరంగల్ ట్రై సిటీ ప్రజలు, యువతి, యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపకు, పాత్రులు అయ్యి విజయవంతం చేయగలరని కోరారు. గత 20 సంవత్సరాలుగా వరంగల్ మహానగరంలో ఈ జగన్నాథుడి రథయాత్ర ఎంతో ఉత్సాహంగా సాగుతుందని అన్నారు. జగన్నాథుడి రథయాత్రతో పాటు ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏకాదశి తదితర పర్వదినాలు అత్యంత వైభవ్వేత్తంగా నిర్వహించడం జరుగుతుందని మురళీవదన కృష్ణ దాస్ ప్రభు మీడియా సమావేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళి వర్ధన కృష్ణ దాస్, భూ పవన హరి నామదాసు, చిట్ట హరి గోపాల దాస్, కారుణ్యమయ కృష్ణ దాస్, విజయ్ రఘునాథ దాస్ తదితరులు పాల్గొన్నారు.






