- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్లో కాల్పులు.. 8 మంది విద్యార్థులు మృతి
by Muthe.Rajitha |
ఆస్ట్రియా(Austria)లో దారుణ ఘటన జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రియా(Austria)లో దారుణ ఘటన జరిగింది. గ్రాజ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ దుండగుడు కాల్పుల(Firing in School)కు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు మృతి చెందగా.. భారీగా టీచర్లు, విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం ఆ దుండగుడు తనని తాను కాల్చుకొని మరణించాడు. ఈ ఘటనతో గ్రాజ్ సహ ఆస్ట్రియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు పాఠశాలకు చేరుకునేలోపే దుండగుడు కాల్చుకొని చనిపోయాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా నిందితుడి ఎవరు, ఈ దాడికి గల కారణాలను సేకరిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






