- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడులైంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు విడుల చేస్తారు.

దిశ, వెబ్ డెస్క్: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడులైంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు విడుల చేస్తారు. ఇక జూన్ 1న ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 8న నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. జూన్, జూలై నెలల్లో ఎంపీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేశారు. 24 రాజ్యసభ స్థానాల్లో ఏపీకి చెందిన నాలుగు స్థానాలు సైతం ఉన్నాయి.
ఏపీకి చెందిన నలగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. వైసీపీ ఎంపీలు అయెధ్యరామిరెడ్డి, పిల్లి బోస్, పరిమల్ నత్వానీతో పాటు టీడీపీకి చెందిన ఎంపీ సానా సతీష్ పదవీకాలం ముగియనుంది. ఇక ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం కారణంగా నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ నాలుగు స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నుండి రేసులో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు మిత్ర పక్షాలకు రెండు సీట్లు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది.






