- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదాల నీట్.. 2013 నుండి 2026 వరకు ఆగని స్కామ్‌లు, వీడని వివాదాలు!
నీట్ పరీక్షపై దేశంలో మరోసారి వివాదం నెలకొంది. మే 3వ తేదీన పరీక్షను నిర్వహించగా రాజస్థాన్ లో పరీక్షకు ముందే పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలు వచ్చాయి. విచారణ జరపగా పరీక్షకు 42 గంటలు ముందే వాట్సప్ లో గెస్ పేపర్ పేరుతో 100 పేజీల పేపర్ లీక్ అయినట్టు అధికారులు గుర్తించగా పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నీట్ పరీక్షపై దేశంలో మరోసారి వివాదం నెలకొంది. మే 3వ తేదీన పరీక్షను నిర్వహించగా రాజస్థాన్ లో పరీక్షకు ముందే పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలు వచ్చాయి. విచారణ జరపగా పరీక్షకు 42 గంటలు ముందే వాట్సప్ లో గెస్ పేపర్ పేరుతో 100 పేజీల పేపర్ లీక్ అయినట్టు అధికారులు గుర్తించగా పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష కోసం పగలూ రాత్రి కష్టపడి చదివి రాసిన విద్యార్థల ఆశలు ఆవిరైపోయాయి. అయితే నీట్ పరీక్షపై వివాదం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2013లో నీట్ పరీక్షను మొదలుపెట్టింది.
అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఎంసెట్ ద్వారా వైద్య విద్యకు ప్రవేశాలు కల్పించగా నీట్ ప్రారంభించిన తరవాత ఎంసెట్ రద్దు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను రద్దు చేశారు. అయితే నీట్ పరీక్షను ప్రేవేశపెట్టిన నాటి నుండి ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. 2016లో నీట్ పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నీట్ ప్రారంభించినప్పుడు తమ రాష్ట్రాల్లో భోదించే సబ్జెక్ట్ నీట్ కు సరిపోతుందో లేదో అని పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ప్రస్తుతం పేపర్ లీక్ అయినట్టు తేలిన రాజస్థాన్ రాష్ట్రంలో 2021లోనూ పేపర్ లీక్ అయ్యింది.
జైపూర్ లో పరీక్షకు ముందే పేపర్ వాట్సాప్ లో వైరల్ అవ్వడంతో కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. 2024లో నీట్ పరీక్షలో భారీ స్కామ్ జరిగింది. జార్ఖండ్ లోని హజారీబాగ్ లో పేపర్ లీక్ అయినట్టు ధృవీకరించారు. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంతో అనుమానం వచ్చి విచారణ జరపగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అంతేకాకుండా బీహార్ లో నిందితులు పేపర్లు తగలబెటట్ఇన ఆనవాళ్లు దొరిగాయి. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అప్పుడే నీట్ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వీటితో పాటు నీట్ పరీక్షకు వెళ్లే విద్యార్థినులను లో దుస్తులు తీసేసి మరీ పరీక్షించడం, బుర్కాలు తొలగించడంతో పాటు నీట్ పై అనేక వివాదాలు నెలకొన్నాయి. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో నీట్ పరీక్షను తొలగించి రాష్ట్ర ప్రభుత్వాలే తమ తమ రాష్ట్రంలో మెడికల్ విద్య ప్రవేశాల కోసం ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.






