- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీ ప్లాన్ అదుర్స్..పైప్ లైన్ ద్వారా రోజుకు 70 లక్షల బ్యారెళ్లు సప్లై
హార్ముజ్ జలసంధి ప్రత్యామ్నాయమైన ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తుందని తాజాగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే తాత్కాలికంగా అమెరికా యుద్ధానికి బ్రేక్ వేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చమురు సరఫరా కొనసాగుతోంది. అయినప్పటికీ అమెరికాకు సపోర్ట్ చేసిన దేశాల నౌకలను హార్ముజ్ జలసంధి దగ్గర ఆపేస్తోంది ఇరాన్. ఈ తరుణంలో సౌదీ సరికొత్త ప్రయత్నానికి నాంది పలికింది.
హార్ముజ్ జలసంధి సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు పైప్ లైన్ ను ఉపయోగిస్తోంది. హార్ముజ్ జలసంధి ప్రత్యామ్నాయమైన ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తుందని తాజాగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పైప్ లైన్ ద్వారా రోజుకు 70 లక్షల బ్యారెళ్లను సప్లై చేస్తోందని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి క్రూడ్ ఆయిల్ ను పైప్ ద్వారా యెంబు పోర్టుకు తరలిస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఎర్ర సముద్రం ద్వారా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ సక్సెస్ అవుతున్నారు.






