- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025ని వెంటాడుతున్న విషాదాలు..ఆరు నెలల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయంటే?
అహ్మదాబాద్ ప్రమాద ఘటనతో దేశంలో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటూ విమానం కూలిన భవనంలో కొందరు డాక్టర్లు సైతం మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ప్రమాద ఘటనతో దేశంలో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటూ విమానం కూలిన భవనంలో కొందరు డాక్టర్లు సైతం మరణించారు. దీంతో మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘటన విమాన ప్రమాదం కాగా 2025లో దేశంలో అనేక ప్రమాదాలు జరగటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవలే బెంగుళూరులో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనను ఇంకా మర్చిపోలేదు కూడా. అయితే ఇంతలోనే విమానం ప్రమాదం చోటు చేసుకుంది. అంతే కాకుండా ఈ ఏడాది జరిగిన మరో విషాద ఘటన పహల్గామ్ ఎటాక్. ఈ ఎటాక్ లో అమాయక పౌరులు 26 మంది చినపోయారు. ఆ తరవాత పాకిస్థాన్ తో జరిగిన ఉద్రిక్తతల కారణంగా బార్డర్ లోని కొందరు పౌరులు కన్నుమూశారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో జరిగిన తొక్కిసలాట, కుంభమేలా తొక్కిసలాట కూడా ఈ ఏడాదే జరిగాయి. ఇక ఇప్పుడు విమాన ప్రమాదం జరగటంతో 2025 అంతా విషాద ఘటనలే చోటు చేసుకుంటున్నాయనే చర్చ మొదలైంది. దీంతో నెటిజన్లు ఏ చేసినా ఎలా చేసినా మృత్యువు వెంటాడుతోందని కామెంట్ చేస్తున్నారు.
Read More..






