భారత్‌కు ట్రంప్ బెదిరింపులు.. స్పందించిన రష్యా

by Gantepaka Srikanth |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌కు చేసిన బెదిరింపులపై రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్ స్పందించారు.

భారత్‌కు ట్రంప్ బెదిరింపులు.. స్పందించిన రష్యా
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌కు చేసిన బెదిరింపులపై రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్‌(India)పై అమెరికా అక్కసు వెళ్లగక్కుతోందని అన్నారు. ఇల్లీగల్‌గా వాణిజ్య ఒప్పందాలకు దేశాలపై అమెరికా ఒత్తిడి చేస్తోందిన ఆరోపించారు. తమ వ్యాపార భాగస్వాములను ఎంచుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుందని అన్నారు. అమెరికా వ్యవహారశైలి బాగోలేదు. తీరు మార్చుకోకపోతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

కాగా, అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని షాకింగ్ ప్రకటన చేశారు. రష్యా నుంచి భారత్‌ పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. భారత్‌పై సుంకాలు పెంచబోతున్నట్లుగా సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్‌ హెచ్చరించారు.

Next Story