- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MT Aqua Titan: రష్యా చమురు వచ్చేసింది..! మంగళూరు తీరానికి చేరిన చమురు నౌక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, రష్యా నుంచి ముడి చమురుతో వస్తున్న ‘ఎంటీ ఆక్వా టైటాన్’ నౌక ఆదివారం కర్ణాటకలోని మంగళూరు తీరానికి చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, రష్యా నుంచి ముడి చమురుతో వస్తున్న ‘ఎంటీ ఆక్వా టైటాన్’ (MT Aqua Titan) నౌక ఆదివారం కర్ణాటకలోని మంగళూరు తీరానికి చేరుకుంది. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) అద్దెకు తీసుకున్న ఈ ట్యాంకర్, ప్రస్తుతం మంగళూరు తీరానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో నిలిచి ఉంది. ఇదే సమయంలో, అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీ (LPG) తో వచ్చిన మరో నౌక కూడా న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఇంధన సరఫరా సాఫీగా సాగేందుకు వీలుగా, మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీ సరుకులపై కార్గో ఛార్జీలను మాఫీ చేస్తూ న్యూ మంగళూరు పోర్టు నిర్ణయం తీసుకుందని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని ఏ పోర్టులోనూ రద్దీ లేదని స్పష్టం చేసింది.
సురక్షితంగా భారత నావికులు, నౌకలు
పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 22 భారతీయ నౌకలు, అందులోని 611 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్ మంత్రిత్వశాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు. పశ్చిమాసియా వివాదం నాలుగో వారానికి చేరి, హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య మార్గాలకు ఆటంకం ఏర్పడినప్పటికీ.. భారత నౌకలు సురక్షితంగానే వస్తున్నాయని తెలిపారు. సుమారు 92,712 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు మార్చి 16, 17 తేదీల్లో భారత్ చేరుకోగా, ‘జగ్ లాడ్కి’ అనే మరో చమురు నౌక బుధవారం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు విజయవంతంగా చేరుకున్న విషయం తెలిసిందే.






