- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్‌పై 805 డ్రోన్లతో భారీ దాడి
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమై మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమై మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ పశ్చిమ దేశాలకు దగ్గరవుతూ, నాటోలో చేరాలని ప్రయత్నించడంతో రష్యా దీనిని తన భద్రతకు ముప్పుగా భావించి ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష దాడికి దిగింది. అప్పటి నుంచి ఇరుదేశాలు ఒకరిపై మరొకరు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగలేదు. తాజాగా ఆదివారం రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఒకేసారి 805 డ్రోన్లు, 13 క్షిపణులను ప్రయోగించింది. అయితే ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ అప్రమత్తంగా వ్యవహరించి 747 డ్రోన్లు, 4 క్షిపణులను విజయవంతంగా కూల్చింది.
అయినా రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులు రాజధాని కీవ్‌లోని ప్రభుత్వ క్యాబినెట్ భవనం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఒక తల్లి, ఆమె మూడు నెలల శిశువు సహా ఇద్దరు మృతి చెందగా, 17–18 మంది గాయపడ్డారు. అధికారుల సమాచారం ప్రకారం దార్నిట్స్కీ, స్వియాటోషిన్‌స్కీ జిల్లాల్లోని నివాస గృహాలు, వాణిజ్య భవనాలు సహా మొత్తం 37 ప్రదేశాల్లో మల్బరాలు పడగా, 8 ప్రాంతాల్లో గణనీయ నష్టం నమోదైంది. ఈ దాడిని ఉక్రెయిన్ ప్రభుత్వం “యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అతిపెద్ద వైమానిక దాడి”గా పేర్కొంది. ప్రజల ప్రాణనష్టం, ఆస్తి నష్టం పెరుగుతున్నందున రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.






