బ్రిటన్ F-35B ఫైటర్ జెట్ ను ముక్కలుగా విడదీసి తరలించేలా ఏర్పాట్లు

by Shamantha N |

కేరళ రాష్ట్రం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జూన్ 14 నుంచి నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ను ఆ దేశానికి పంపడం కోసం పాక్షికంగా విడదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్రిటన్  F-35B ఫైటర్ జెట్ ను ముక్కలుగా విడదీసి తరలించేలా ఏర్పాట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ రాష్ట్రం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జూన్ 14 నుంచి నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ను ఆ దేశానికి పంపడం కోసం పాక్షికంగా విడదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళలో అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత, ఈ ఐదవ తరం స్టెల్త్ జెట్ కు మరమ్మత్తులు చేసి పంపేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఈ జెట్ ను విడదీసి బ్రిటన్ కు తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బ్రిటిష్ అధికారులు ఇప్పుడు జెట్‌ను యునైటెడ్ కింగ్‌డమ్‌కు రవాణా చేయాలన్న దిశగా పనులు ప్రారంభించారు.

టెక్నికల్ గా క్లిష్టమైన ప్రక్రియ

సైనిక విమాన రవాణా కోసం F-35Bని విడదీయడం అనేది టెక్నికల్ గా చాలా క్లిష్లమైన ప్రక్రియ. రక్షణ రంగ నిపుణుల ప్రకారం.. ఈ జెట్‌ను C-17 గ్లోబ్‌మాస్టర్ III కార్గో విమానంలో తరలించే అవకాశం ఉంది. ఈ విమానంలోని వెడల్పు పరిమితి కారణంగా F-35 రెక్కలను విడదీయాల్సి ఉంటుంది. రెక్కలను సురక్షితంగా వేరు చేసి, జెట్‌ను కాంపాక్ట్ యూనిట్‌గా మార్చడం వల్ల మాత్రమే దానిని లోడ్ చేయడం సాధ్యమవుతుంది. దీని కోసం అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా పని చేస్తున్నారు. C-17 గ్లోబ్‌మాస్టర్ III కార్గో విమానం దాదాపు రెండు F-35B ఫైటర్ జెట్ లను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది.

గతంలోనూ ఇలాంటి తరలింపులు.. ఎక్కడంటే

ఇలాంటి తరలింపులు గతంలోనూ జరిగాయి. 2019లో అమెరికా ఎయిర్ ఫోర్స్, ఎగ్లిన్ బేస్ నుంచి హిల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కి F-35A జెట్‌ను రెక్కలను విడదీ చేసి గ్లోబ్‌మాస్టర్ III ద్వారా తరలించింది. 2022లో దక్షిణ కొరియాలో బెల్లీ ల్యాండింగ్ తర్వాత, F-35A జెట్‌ను రోడ్డుమార్గం ద్వారా తరలించేందుకు రెక్కలను తొలగించారు. ఈ తరహా లోనే తిరువనంతపురంలో ఉన్న F-35Bని కూడా అలాగే తరలించేందుకు బ్రిటన్ ఆఫీసర్లు రెడీ అవుతున్నారు.

Next Story