- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా హెచ్-1బీ వీసా విధానంలో విప్లవాత్మక మార్పులు.. లాటరీ రద్దు, వేతనమే ప్రాధాన్యం
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ (H-1B) వీసాల జారీ ప్రక్రియలో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులను ఖరారు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ (H-1B) వీసాల జారీ ప్రక్రియలో ట్రంప్ ప్రభుత్వం (Trump's government) కీలక మార్పులను ఖరారు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న కంప్యూటర్ ఆధారిత 'ర్యాండమ్ లాటరీ' ('Random lottery') విధానానికి స్వస్తి పలికింది. ఇకపై అభ్యర్థుల వేతన స్థాయి (Wage levels), నైపుణ్యం ఆధారంగానే వీసాలను కేటాయించాలని నిర్ణయించింది. అమెరికా హోంశాఖ పంపిన ప్రతిపాదనలపై తుది సమీక్ష పూర్తి చేసిన ప్రభుత్వం, అత్యధిక వేతనం పొందే నిపుణులకే వీసా (Visa) దక్కేలా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' విడుదల చేసిన తుది నిబంధనలు 2026 ఫిబ్రవరి నుండి అమల్లోకి రానున్నాయి.
కొత్త విధానం ప్రకారం, ఉద్యోగుల వేతన స్థాయిలను బట్టి నాలుగు విభాగాలుగా విభజించి, ఎక్కువ వేతనం ఉన్న వారికి ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు. ఇది అమెరికన్ కార్మికుల వేతనాలను కాపాడటంతో పాటు, తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకునే పద్ధతికి అడ్డుకట్ట వేస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం భారతీయ ఐటీ రంగంపై మిశ్రమ ప్రభావం చూపనుంది. సీనియర్ నిపుణులకు మేలు జరిగినప్పటికీ, అమెరికాలో చదువు పూర్తి చేసి తక్కువ జీతంతో కెరీర్ ప్రారంభించే విద్యార్థులకు మరియు చిన్న కంపెనీలకు ఈ కొత్త నిబంధనలు సవాలుగా మారే అవకాశం ఉంది.






