మొక్కలు శ్వాసించడం ఎప్పుడైనా చూశారా? తొలిసారి వీడియో తీసిన సైంటిస్టులు

by Naga Rani Yarlagadda |

మొక్కలు ఆక్సిజన్ ను రిలీజ్ చేసి కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తాయని, రాత్రివేళల్లో కార్బన్ డై ఆక్సైడ్ ను రిలీజ్ చేస్తాయని మనం చదువుకున్నాం.

మొక్కలు శ్వాసించడం ఎప్పుడైనా చూశారా? తొలిసారి వీడియో తీసిన సైంటిస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: మొక్కలు ఆక్సిజన్ ను రిలీజ్ చేసి కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తాయని, రాత్రివేళల్లో కార్బన్ డై ఆక్సైడ్ ను రిలీజ్ చేస్తాయని మనం చదువుకున్నాం. ఈ ప్రక్రియ ఫొటోసింథసిస్ ఆధారంగా జరుగుతుంది. అయితే ఎప్పుడైనా మొక్కలు ఎలా శ్వాసిస్తాయో ఎప్పుడైనా చూశారా? వాటికి మనలా కంటికి కనిపించేలా కళ్లు, ముక్కు, చెవులు వంటి ఇంద్రియాలు ఉండవు కదా. మరెలా శ్వాసిస్తాయి? దీనికి జవాబుగానే అమెరికాకు చెందిన సైంటిస్టులు ఓ వీడియోను విడుదల చేశారు.

మొక్కలు.. ఆకులపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకుంటాయి. దీనిని అమెరికాలోని ఇల్లినాయిస్ అర్బానా - షాంపైన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీడియో తీసి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సైంటిస్టులు స్టొమాటా ఇన్ సైట్ (Stomata In-Sight) అనే ఒక పరికరాన్ని అభివృద్ధి చేసి.. మొక్కల ఆకులపై ఉండే రంధ్రాలు కిరణజన్య సంయోగక్రియ కోసం కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తూ.. అదే సమయంలో నీటి ఆవిరిని ఎలా బయటకు పంపుతాయో కళ్లకు కట్టినట్లు చూపించింది. కాన్ ఫోకల్ మైక్రోస్కోప్, గ్యాస్ మార్పిడిని కచ్చితంగా కొలిచే వ్యవస్థ, మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్ వేర్లను అనుసంధానించి ఈ పరికరాన్ని రూపొందించారు. టెంపరేచర్, తేమ, కాంతి, కార్బన్ డయాక్సైడ్ వంటి అంశాలను నియంత్రిస్తూ పత్రరంధ్రాల పనితీరును క్షణక్షణ గమనించవచ్చు. ఇది వ్యవసాయ రంగానికి ఒక వరంలాంటిదని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీపై ఇల్లినాయిస్ యూనివర్సిటీ పేటెంట్ రైట్స్ పొందింది.

Next Story