పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట: అస్సాం CM సతీమణి కేసులో బెయిల్ మంజూరు

by Kema Shiva Kumar |

పాస్‌పోర్ట్ వివాదానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట: అస్సాం CM సతీమణి కేసులో బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఎట్టకేలకు ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన భార్య రింకీ భుయాన్ శర్మ (Rinki Bhuyan Sharma)కు సంబంధించిన వివాదాల నేపథ్యంలో తలెత్తిన పాస్‌పోర్ట్ ఉల్లంఘన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నమోదైన కేసును విచారించిన సుప్రీంకోర్టు, పవన్ ఖేరాకు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఓ పత్రికా సమావేశంలో పవన్ ఖేరా మాట్లాడుతూ.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణి రినికి భుయాన్ శర్మకు చెందిన కంపెనీకి పీపీఈ (PPE) కిట్ల సరఫరాలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆమె వివిధ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించారు. దీంతో రినికి భుయాన్ శర్మ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ఖేరా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story