స్పా సెంటర్‌పై దాడి.. కిటికీల్లో నుంచి ఎస్కేప్.. (వీడియో)

by Sujitha Rachapalli |

బంగ్లాదేశ్ ఢాకాలో స్పా సెంటర్స్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మాదక ద్రవ్యాల వ్యాపారం నుంచి వ్యభిచార దందా వరకు.. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నాయి. గుల్షన్, బనానీ, నికేతన్ లాంటి ప్రాంతాల్లో దాదాపు వందల సంఖ్యలో పార్లర్లు, మసాజ్ సెంటర్లు ఇదే వ్యాపారం

స్పా సెంటర్‌పై దాడి.. కిటికీల్లో నుంచి ఎస్కేప్.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ ఢాకాలో స్పా సెంటర్స్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మాదక ద్రవ్యాల వ్యాపారం నుంచి వ్యభిచార దందా వరకు.. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నాయి. గుల్షన్, బనానీ, నికేతన్ లాంటి ప్రాంతాల్లో దాదాపు వందల సంఖ్యలో పార్లర్లు, మసాజ్ సెంటర్లు ఇదే వ్యాపారం చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులను అట్రాక్ట్ చేస్తూ తప్పుడు పనులు చేసేందుకు ఉసిగొల్పుతున్నాయి. దీంతో ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలోనే బనానీలో ఓ స్పా సెంటర్‌పై దాడి చేయగా.. లోపల పాడు పనులు చేస్తున్న జనాలు కిటికీల గుండా ఎస్కేప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలాంటి అనైతిక కార్యకలాపాలు చేస్తున్నా చట్టపరమైన లొసుగులు వారిని బయట స్వేచ్ఛగా తిరగనిస్తున్నాయని, కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story