విషాదం.. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

by Malleboina Mahesh |   (  Updated:2025-04-21 08:12:37  IST  )

పోప్ ఫ్రాన్సిస్ (88) అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు.

విషాదం.. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: పోప్ ఫ్రాన్సిస్ (88) అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యం బాధ పడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోప్ తన నివాసంలో మరణించారని మాత్రమే వాటికన్ పేర్కొంది. కాగా ఈ విషయాన్ని కార్డినల్ కెవిన్ ఫెర్రెల్, అపోస్టోలిక్ ఛాంబర్ యొక్క కామెర్‌లెంగో, ధృవీకరించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గోన్నారు. కూడా పాల్గొన. పోప్ ఫ్రాన్సిస్ 2025 ఫిబ్రవరి, మార్చిలో రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో 38 రోజుల పాటు బైలాటరల్ న్యూమోనియాతో బాధపడ్డారు. ఈ సమయంలో ఆయన రెండు సార్లు తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యంతో జీవన్మరణ స్థితిని ఎదుర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఒక సందర్భంలో, ఆయన ఊపిరితిత్తుల్లో సమస్యల కారణంగా శ్వాస తీసుకోలేక వాంతి చేసుకున్నారు. ఇది ఆయన ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చింది. అనంతరం కొద్ది కొద్దిగా ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు చివరి శ్వాస విడిచారు.

Next Story