- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌పై ఛార్జిషీట్.. జైలు శిక్షకు బదులు కీలక ఒప్పందం!
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌పై మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడిపిన (DUI) కేసులో తాజాగా ఛార్జిషీట్ నమోదైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌పై మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడిపిన (DUI) కేసులో తాజాగా ఛార్జిషీట్ నమోదైంది. కాలిఫోర్నియాలోని వెంచూరా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం గురువారం ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అయితే, ఆమెకు జైలు శిక్ష పడే అవకాశం లేదని, ప్రత్యామ్నాయ శిక్షలతో కేసు ముగిసే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అరెస్టు ఎప్పుడంటే..?
ఈ ఏడాది మార్చి 4న కాలిఫోర్నియాలోని తన ఇంటి సమీపంలో బ్రిట్నీ బీఎండబ్ల్యూ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె మద్యం, డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు నిర్ధారించి అరెస్టు చేశారు. మరుసటి రోజే ఆమె బెయిల్‌పై విడుదల కాగా, పోలీసులు మార్చి 23న విచారణ నివేదికను సమర్పించారు.
రిహాబ్ కేంద్రం నుంచి విడుదల.. మే 4న విచారణ
అరెస్టు తర్వాత తన మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన బ్రిట్నీ.. ఏప్రిల్ 12న స్వచ్ఛందంగా రిహాబిలిటేషన్ (పునరావాస) కేంద్రంలో చేరారు. తాజాగా ఆ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆమె బయటకు వచ్చారు. అరెస్టు జరిగినప్పటి నుంచి ఆమె మద్యానికి పూర్తిగా దూరంగా ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్యంగా, సంతోషంగా మునుపటి కంటే సానుకూల దృక్పథంతో ఉన్నారని అంతర్జాతీయ మీడియా సమాచారం. ఈ కేసుకు సంబంధించి మే 4న (సోమవారం) కోర్టులో విచారణ జరగనుంది. ఇది చిన్నపాటి నేరం (మిస్‌డిమీనర్) కావడంతో బ్రిట్నీ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఆమె తరఫున న్యాయవాది హాజరు కానున్నారు.
జైలు శిక్షకు బదులు ఒప్పందం
బ్రిట్నీకి గతంలో ఇలాంటి నేర చరిత్ర లేకపోవడం, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రాసిక్యూటర్లు ఆమెకు ఒక ఒప్పందాన్ని (Plea deal) ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఆమె తన నేరాన్ని అంగీకరిస్తే.. జైలు శిక్షకు బదులుగా 12 నెలల పాటు ప్రొబేషన్‌లో ఉంచడం, డ్రైవింగ్ సేఫ్టీ తరగతులకు హాజరుకావడం, జరిమానా చెల్లించడం వంటి షరతులతో కేసును పరిష్కరించనున్నారు. ఆమె ఇప్పటికే రిహాబ్ సెంటర్‌లో చికిత్స తీసుకోవడం ఈ కేసులో ఆమెకు కలిసి రానుంది. తన గత జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, 2021లో కన్జర్వేటర్‌షిప్ (చట్టపరమైన సంరక్షణ) నుంచి స్వేచ్ఛ పొందిన బ్రిట్నీ, ఈ తాజా పరిణామంతో తన జీవనశైలిని పూర్తిగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.






