- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం..ఏకంగా 43 ఏళ్ల తర్వాత !
ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో 32వ అంతర్జాతీయ అత్యున్నత పురస్కారం చేరింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఐరోపాలోని స్వీడన్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ... అక్కడి నుంచి నేరుగా నార్వే చేరుకున్నారు. దాదాపు 43 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ దేశంలో భారత ప్రధాని హోదాలో మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనతో ఇండియా-నార్వే బంధం బలపడుతుందని ఆశిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. ఆ దేశ రాజ దంపతులు కింగ్ హెరాల్డ్ 5, క్వీన్ సోంజాతో మాట్లాడడం సహ, ప్రధాని స్టోర్ తో చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు. ఇక రేపు ఓస్లోలో మూడో భారత్ - నార్డిక్ సమ్మిట్ జరగనున్నట్లు తెలిపారు.
మోడీ ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో 32వ అంతర్జాతీయ అత్యున్నత పురస్కారం చేరింది. లేటెస్ట్ గా హైయెస్ట్ హానర్ ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రధాని నరేంద్ర మోడీకి అందించింది నార్వే సర్కార్. ఇక నిన్న స్వీడన్ లో కూడా మరో పురస్కారాన్ని అందుకున్నారు మోడీ. దీనిపై కేంద్ర సర్కార్ హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ అవార్డు రావడం దేశం గర్వించదగ్గ అంశం అని పేర్కొంది.






