ఇరాన్ ప్రెసిడెంట్‌తో ప్ర‌ధాని మోడీ చర్చలు

by velandi.Saikiran |

ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ తో కీలక చర్చలు జరిగినట్లు స్వయంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇరాన్ ప్రెసిడెంట్‌తో ప్ర‌ధాని మోడీ చర్చలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 13 రోజులుగా ఈ మూడు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల ఇండియాలో చమురు కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఇండియా ఒక్కటే కాదు పాకిస్తాన్, చైనాతో పాటు జపాన్ వరకు ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ముందడుగు వేశారు. ఇరాన్ ప్రెసిడెంట్ తో ప్రధాని నరేంద్ర మోడీ కీలక చర్చలు జరిపారు.

ఇరాన్ ప్రెసిడెంట్ తో ప్రధాని మోడీ చర్చలు

మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న పరిస్థితులపై తాజాగా ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ తో ( Masoud Pezeshkian) కీలక చర్చలు జరిగినట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణ నష్టం, మౌలిక సదుపాయాల ధ్వంసం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతీయ పౌరుల భద్రత, అడ్డంకులు లేని ఇంధన సరఫరా తమకు అత్యంత ప్రాధాన్యత అంశాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాంతికి ఇండియా కట్టుబడి ఉంటుందని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ను కోరారు ప్రధాని నరేంద్ర మోడీ.

Next Story