- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > PM Modi gifts to Biden couple: జో బైడెన్ దంపతులకు.. మోదీ అరుదైన బహుమతులు
PM Modi gifts to Biden couple: జో బైడెన్ దంపతులకు.. మోదీ అరుదైన బహుమతులు
by Geesa Chandu |
యూఎస్ ప్రెసిడెంట్(US President) జో బైడెన్ దంపతుల(Joe Biden Couples)కు ప్రధాని మోదీ అరుదైన బహుమతులను అందించారు.

X
దిశ, వెబ్ డెస్క్: యూఎస్ ప్రెసిడెంట్(US President) జో బైడెన్ దంపతుల(Joe Biden Couples)కు ప్రధాని మోదీ అరుదైన బహుమతులను అందించారు. క్వాడ్ సదస్సులో భాగంగా 3 రోజుల పర్యటన కొరకు మోదీ అమెరికాకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా డెలావర్ లోని నివాసంలో బైడెన్ ను కలిసిన మోదీ.. ఆయనకు వెండితో చేసిన రైలు నమూనా(Silver Train Model)ను బహుమతిగా ఇచ్చారు. దీనిని మహారాష్ట్ర హస్త కళాకారులు తయారుచేశారు.అలాగే బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కు జమ్మూకాశ్మీర్ లో తయారు చేసిన పష్మినా శాలువాను బహుమతిగా అందించారు. బైడెన్ కు బహూకరించిన రైలు మోడల్(నమూనా) 92.5 శాతం సిల్వర్ మెటల్ ను ఉపయోగించి తయారు చేయగా.. ఈ రైలు నమూనాపై హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఢిల్లీ-డెలావర్, ఇండియన్ రైల్వేస్ అని రాసి ఉంది. అయితే దీన్ని ఫిలిగ్రీ వర్క్ వంటి సంప్రదాయ పద్దతుల ద్వారా రూపొందించారు.
Next Story






