రష్యా అధ్యక్షుడి నివాసంపై దాడి వార్తలపై ప్రధాని మోడీ ఆందోళన

by Malleboina Mahesh |

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

రష్యా అధ్యక్షుడి నివాసంపై దాడి వార్తలపై ప్రధాని మోడీ ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసాన్ని (Vladimir Putin's official residence) లక్ష్యంగా చేసుకుని భారీ డ్రోన్ దాడి (Massive drone attack) జరగడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఉత్తర రష్యాలోని వాల్దాయ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ సుమారు 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని, అయితే రష్యా రక్షణ దళాలు వాటిని విజయవంతంగా అడ్డుకున్నాయని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని రష్యా "స్టేట్ టెర్రరిజం"గా అభివర్ణించగా, ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ పరిణామం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war)లో సరికొత్త ఉద్రిక్తతలకు దారితీసింది.రష్యా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న నివేదికల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలను అంతం చేయడానికి, శాంతిని నెలకొల్పడానికి దౌత్యపరమైన చర్చలు మాత్రమే సరైన మార్గమని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. శత్రుత్వాలను వీడి శాంతి సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలపైనే అందరి దృష్టి సారించాలని, శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలకైనా స్వస్తి పలకాలని ప్రధాని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతను తగ్గించేందుకు దౌత్యం, సంభాషణలే కీలకమని భారత్ మొదటి నుంచి చెబుతున్న విషయాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.

Next Story