- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !
ప్రపంచంలో కొన్ని దేశాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ.. తమ దేశానికి రావాలని ఆహ్వానం పలుకుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో కొన్ని దేశాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ.. తమ దేశానికి రావాలని ఆహ్వానం పలుకుతున్నాయి. పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నాయి. కొన్ని దేశాలైతే వీసా ఫ్రీ విజిట్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. భారత్ కూడా ఇదే బాటలో వెళ్లేందుకు ఫోకస్ పెట్టింది. కానీ.. యూరప్ దేశాలు మాత్రం మా దేశానికి రాకండి మహాప్రభో అని పర్యాటకుల్ని వేడుకుంటున్నాయి. అదేంటీ.. పర్యాటకులు ఎక్కువగా వెళ్తే ఆదాయం పెరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఎక్కువస్థాయిలో పర్యాటకులు వస్తుండటంతో ప్రభుత్వాలతో పాటు స్థానికులకూ ట్రావెల్ ఓవర్ క్రౌడింగ్ సమస్యలు మొదలయ్యాయి. దీంతో ట్రావెల్ ఆంక్షలు విధిస్తున్నాయి.
యూరప్ పర్యాటకంలో కళ్లను కట్టిపడేసే కట్టడాలు, ఆకట్టుకునే బీచ్ లు, అక్కడి జీవన శైలి, విభిన్న సంస్కృతులు ఆకర్షిస్తాయి. ఫ్రాన్స్ లోని పారిస్, ఇటలీలోని వెనీస్, యూకేలోని లండన్, స్పెయిన్లోని బార్సిలోనా, నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్, హంగేరీలోని బుడపెస్ట్, ఆస్ట్రియాలోని వియాన్నా, ఇటలీలోని రోమ్.. ఇలా యూరప్ దేశాల్లోని చాలా ప్రాంతాలు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టూరిజం డెస్టినేషన్ యూరప్ అనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది ఏకంగా 70 కోట్ల మంది పర్యాటకులు అక్కడికి వెళ్లారంటే.. అక్కడి టూరిజం ఏ స్థాయిలో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాం.
సమస్యేంటంటే..
కేవలం అంతర్జాతీయ టూరిస్టులే కాకుండా.. యూరప్ దేశాల వారు కూడా ఆయా టూరిజం నగరాలకు వెళ్తుండటం పెద్ద సమస్యగా మారింది. ఖండంలో దేశాల మధ్య దూరం తక్కువగా ఉండటం.. బస్సు, ట్రైన్, విమానాల్లో చాలా తక్కువ ఖర్చుతోనే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వీలుండటంతో వీకెండ్ వస్తే టూరిజం ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా డ్రీమ్ డెస్టినేషన్, బకెట్ లిస్టులలో కూడా యూరప్ దేశాలే ముందుంటున్నాయి. దీంతో ప్రజలు ఆ దేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్, క్రిస్మస్, ఈస్టర్ హాలిడేస్ సమయంలో టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మనకు సమ్మర్ అయితే అక్కడ చల్లగా ఉంటుంది కదా మరి. కొత్తజంటల హనీమూన్ వెకేషన్ కూడా అదే అవుతుంది. ఆదాయం భారీగానే వస్తున్నా.. స్థానికులకు రవాణా, వసతిసేవల్లో తీవ్ర ఇబ్బందులొస్తున్నాయి. కొన్ని సంస్థలు పర్యాటకులకు ఇళ్లను అద్దెకు ఇస్తుండటంతో స్థానిక ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా అక్కడి ప్రజలకు ఇళ్లు అద్దెకు దొరకని పరిస్థితి. అంతేకాదు.. కాలుష్యం, నీటికొరతతో పాటు పర్యావరణానికి హానిచేసే వ్యర్థాలు కూడా పెరుగుతుండటంతో స్థానికుల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే తమ దేశాలకు టూరిస్టులు రావొద్దని యూరప్ దేశాలు వేడుకుంటున్నాయి.






