- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుబాటులోకి Gen Z రిటైర్మెంట్ హోమ్స్..! బెనిఫిట్స్ ఇవే..
యూత్ రిటైర్మెంట్ హోమ్స్ ప్రధాన ఉద్దేశం నాన్-స్టాప్ డిజిటల్ ప్రెజర్, కనామిక్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, వర్క్ ఫటీగ్, బర్న్ అవుట్ సమస్యలను తగ్గించడమే.

దిశ, ఫీచర్స్ : పదవీ విరమణ ఉద్యోగుల కోసం నిర్మించే విశ్రాంతి గృహాల గురించి మీరు వినే ఉంటారు. ఆయా నిర్మాణ సంస్థలు వీటిని అందిస్తుంటాయి. కానీ జెన్ జీ (Gen Z) లకు రిటైర్మెంట్ హోమ్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో అయితే లేవు. కానీ మలేషియా, చైనా వంటి దేశాల్లో ఇవి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. నాన్‌స్టాప్ డిజిటల్ ప్రెజర్, ఎకానమిక్ స్ట్రెస్ వంటివి పెద్దలకే కాదు, ఇప్పుడు యువతలోనూ అధిక ఒత్తిడికి దారితీస్తున్నాయి. దీంతో డిప్రెషన్ అండ్ వర్క్‌ఫెటీగ్, బర్న్ అవుట్ సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు వాటి నుంచి బయడేందుకు అవసరమైన వాతావరణం, సౌకర్యాలు కల్పించే అందమైన భవంతులు మలేషియా, చైనా వంటి దేశాల్లో ఉంటున్నాయి. వీటినే యూత్ లేదా Gen Z రిటైర్మెంట్ హోమ్స్ అని పిలుస్తున్నారు.
ప్రధాన ఉద్దేశం ఇదే..
రిటైర్మెంట్ హోమ్స్ ప్రధాన ఉద్దేశం నాన్-స్టాప్ డిజిటల్ ప్రెజర్, కనామిక్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, వర్క్ ఫటీగ్, బర్న్ అవుట్ సమస్యలను తగ్గించడమే అంటున్నారు నిపుణులు. అందుకోసం జెన్‌జీ విశ్రాంత గృహాలు కలిసి భోజనం చేయడం, క్రియేటివ్ యాక్టివిటీస్, మెడిటేషన్, ఆఫ్‌లైన్ టైమ్ వంటి స్లో లివింగ్‌ను ప్రోత్సహిస్తాయి. అంటే యువతకు సోషల్ స్పేస్‌ను ప్రొవైడ్ చేసి, పాజ్ తీసుకోవడం, రీకాలిబ్రేట్ చేయడం, మెంటల్ వెల్‌బీయింగ్‌ను ప్రమోట్ చేయడం వంటి సేవలు అందిస్తాయి.
ప్రయోజనాలు..
ఇటీవల మలేషియాలోని పెరాక్ రాష్ట్రంలో గల గోపెంగ్ ప్రాంతంలో ‘జెన్ Z రిటైర్మెంట్ హోమ్’ అనేది బర్న్-అవుట్ యంగ్ అడల్ట్స్ కోసం డిజైన్ చేయబడిన ఒక ప్రత్యేకమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇది సాంప్రదాయిక రిటైర్మెంట్ హోమ్‌లా కాకుండా.. 20-30 ఏళ్ల వయసు వారికి రెస్ట్, స్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీని అందించడానికి 8 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడింది. ఇక్కడ జాబ్స్, గోల్స్ లేదా ప్రొడక్టివిటీ, ఆన్‌లైన్ వంటి ప్రెజర్లకు అవకాశం లేదు. జర్నలింగ్, రీడింగ్, మెడిటేషన్, ప్రకృతిలో ప్రశాంతంగా గడపం, నచ్చిన యాక్టివిటీస్‌లో పాల్గొనడం చేస్తారు. మలేషియన్ కరెన్సీలో నెలకు RM2,000, అంటే ఇండియన్ ₹45,000 చెల్లించి యువత ఎవరైనా ఇందులో చేరవచ్చు. మూడు పూటలా భోజనం, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన యాక్టివిటీస్, ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడేసే ప్రోగ్రాములను ఆర్గనైజర్లు ప్లాన్ చేస్తూ నిర్వహిస్తుంటారు. మలేషియాతోపాటు చైనాలోనూ ఇలాంటి యూత్ రిటైర్మెంట్ హోమ్స్ 2022 నుంచి అందుబాటులో ఉన్నాయి.






