- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీమలు కాదు మనుషులే.. గాజాలో ఆహారం కోసం ట్రక్కుల వెంట పరుగులు..వీడియో వైరల్
గాజాలో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో గాజా ప్రజలు నలిగిపోతున్నారు. యుద్ధం కారణంగా ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, బాంబుల మోతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: గాజాలో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో గాజా ప్రజలు నలిగిపోతున్నారు. యుద్ధం కారణంగా ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, బాంబుల మోతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఆహారం కోసం ఫుడ్ ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్నారు. వృద్ధులు ఆకలికి అలమటిస్తూ రోడ్డుపైనే కిందపడి మరణిస్తున్నారు. తాజాగా గాజాలో ఫుడ్ ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో వేల మంది ప్రజలు ఆహారం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్నారు. ఇచ్చే వరకు కూడా కూడా ఆగకుండా ట్రక్కులపైకి ఎక్కి ఆర్థనాదాలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు శాటిలైట్ చిత్రాలు తీయగా ఇసుక వేస్తే రాలనంత జనం ట్రక్కుల చుట్టూ కనిపిస్తున్నారు. 111 మంది ఆకలి చావులతో మరణించినట్టు తెలుస్తోంది. అందులో 80 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించడం బాధాకరం. రెండు రోజుల్లోనే 20 మంది మరణించినట్టు తెలుస్తోంది. వీడియో






